కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

-

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు హెల్త్ డైరెక్టర్ ఘటన శ్రీనివాసరావు. అదే తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీనివాసరావు.

telangana-dh-srinivas
telangana-dh-srinivas

సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి టికెట్ వస్తే పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే తనకే మద్దతుగా నిలిచి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిసి చెప్పారు గడల శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news