8 పాస్​పోర్ట్ ఫొటోలు దిగితే.. ఒక టమాటా ప్యాకెట్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా..?

-

టమాటా ధర రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలోనే టమాటా చుట్టూ వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కొందరు వ్యాపారులైతే టమాట ఆఫర్లు ప్రకటిస్తూ తమ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తున్నారు. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్ కూడా అలాంటి ఆలోచనే చేశాడు. ఫొటో స్టూడియోకు గిరాకీ ఎక్కువగా లేకపోవడంతో ఓ వినూత్న ఆలోచనకు తెరలేపాడు. అదేంటంటే..?

కొత్తగూడెం బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో పట్టణానికి చెందిన ఆనంద్‌ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. తన వద్ద రూ.100 వెచ్చించి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు (8) తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. ఈ ‘వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 32 మంది వినియోగదారులు వచ్చారు. రూ.100 వెచ్చించి ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటాలు అందజేసినట్లు ఆనంద్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news