చంద్రబాబు పుంగనూరు పర్యటనలో పోలీసులు, వైసిపి కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారని ఆరోపిస్తున్న అధికారపక్షం పిలుపు మేరకు ఇవాళ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. బస్సులు రోడ్డు ఎక్కలేదు.
నిన్న ఘర్షణలో గాయపడిన పోలీసులు, కార్యకర్తలను మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. వైసీపీ పార్టీ బంద్ కు పిలుపు ఇవ్వడంతో చిత్తూరులో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు ప్రజలు. షాపులు, దుకాణాలు స్వచ్చందంగా మూసి వేసిన యజమానులు.. బంద్ లో పాల్గొంటున్నారు. అటుప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిలిపివేశారు యజమానులు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతంగా సాగుతోంది.