టిడిపి అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పొలిటికల్ సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా సాధించేది ఏమీ లేదన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను సృష్టించింది చంద్రబాబు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పందికొక్కుల ఇసుకను తిన్నది టిడిపి నేతలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోనే జిడిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కేసులు పెట్టించుకోమనడం లోకేష్ తెలివికి నిదర్శనం అని చేశారు కారుమూరి. పౌరసరఫరాల శాఖతో అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో కల్తీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కల్తీ చేస్తున్న పెట్రోల్ బంకులను చీజ్ చేశామని కొన్ని బంగారు షాపుల్లో కూడా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి 131 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ప్రజలకు నష్టం జరగకూడదనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ దాడులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.