ఇండియాపై కుట్రలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్ లు చట్ట విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. భారీగా విధించిన సుంకాలు భారత్ సహా పలు దేశాలను ప్రభావితం చేశాయన్న కోర్టు… టారిఫ్ లు చట్ట విరుద్ధమని వెల్లడించింది.

ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పును యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైన ట్రంప్…ఈ విషయంలో తగ్గేదిలేదు అంటున్నారు. కాగా భారతీయులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాకు సంబంధించిన రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రూపాయి విలువ ఇంత దిగజారడం ఇదే తొలిసారి అంటున్నారు.
భారత వస్తువుల పై అమెరికా విధించిన సుంకాల ప్రభావంతో రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయినట్లు చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. దీంతో రూపాయి మారక విలువ భారీగా క్షీణించి తొలిసారి 87.97 వద్ద జీవన కాల కనిష్ఠాన్ని తాకిందని చెబుతున్నారు.