BREAKING : FTII ప్రెసిడెంట్ గా హీరో మాధవన్ … !

-

తమిళ హీరో ఆర్ మాధవన్ అంటే ఏమిటో చెలి, సఖి, రన్ లాంటి సినిమాలు చూసిన వారికే పూర్తిగా అర్ధం అవుతోంది. ఆ దశకంలో ఇతనంటే అమ్మాయిలకు ఎంత పిచ్చి అంటే మాటల్లో చెప్పలేము.. ముఖ్యంగా చెలి సఖి సినిమాలు యువతీయువకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన ఆర్ మాధవన్ కు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు వయసు మీద పడుతున్నా అడపా దడపా సినిమాలు మరియు కొన్ని సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు నేనున్నానని గుర్తు చేస్తున్నాడు. ఇక తాజాగా ఆర్ మాధవన్ కు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక విభాగానికి ప్రెసిడెంట్ గా ఎంపికయ్యాడు. ఆర్ మాధవన్ ను ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కు ప్రెసెడెంట్ గా నామినెటే అయ్యాడు. అంతే కాకుండా గవర్నింగ్ కౌన్సిల్ కు చైర్మన్ గా ఎంపికవ్వడం విశేషం.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాధవన్ ను ప్రశంసిస్తూ ఈ సంస్థను మీ అనుభవంతో ఇంకా గొప్ప స్థాయికి తీసుకు వెళ్లాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news