నా భర్తను వాళ్లే తగలబెట్టారు: రవీందర్ భార్య

-

ఆత్మహత్య చేసుకున్న హోం గార్డు రవీందర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవీందర్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై
రవీందర్ భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేసింది.

ravinder wife comments
ravinder wife comments

హోంగార్డు రవీందర్ మృతిపై ఆయన భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తపై ASI నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్ ను అన్ లాక్ చేసి డేటా రిలీజ్ చేశారని…నర్సింగ్ రావు, చందును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తన భర్తతో మాట్లాడాకే చంపేశారని… ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news