ఈ స్థలంలో భోజనం చేస్తే అదృష్టం కాదు, దురదృష్టం వస్తుందట.. కారణం తెలుసా?

-

భోజనం కేవలం కడుపు నింపడమే కాదు ఫ్రెండ్స్, అది శుభాన్ని కూడా కలిగించాలి. మన పెద్దలు చెబుతున్నట్లు ఇంట్లో కొన్ని స్థలాల్లో కొన్ని పద్ధతుల్లో తినడం వల్ల దురదృష్టం, ఆర్థిక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మనం ఆహారం ఈ ప్లేస్ లో తింటే లక్ష్మీదేవి కోపానికి కారణం అవ్వటం ఖాయం అంటున్నారు పెద్దలు. దాని వెనుక ఉన్న రహస్య కారణాన్ని తెలుసుకుందాం…

మనం రోజూ చేసే పనుల్లో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరానికి శక్తిని ఇచ్చి మనసును ప్రభావితం చేస్తుంది. అందుకే వాస్తు శాస్త్రం మరియు భారతీయ సంస్కృతిలో ఆహారం తినే స్థలం మరియు పద్ధతికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆధునిక జీవనశైలిలో చాలా మంది టీవీ చూస్తూనో హడావిడిగానో మంచంపై, సోఫా లో కూర్చుని భోజనం చేయడం అలవాటు చేసుకున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.

Eating in This Place Brings Bad Luck – Here’s Why You Should Avoid It
Eating in This Place Brings Bad Luck – Here’s Why You Should Avoid It

మంచం అనేది నిద్ర, విశ్రాంతి మరియు ప్రైవసీకి సంబంధించిన స్థలం. అలాంటి చోట ఆహారం తీసుకోవడం వల్ల ఆ స్థలం యొక్క పవిత్రత దెబ్బతింటుందని నమ్ముతారు. ఆహారం తినేటప్పుడు, ఆహార పదార్థాలు లేదా దాని పాత్రలు మంచంపై పెట్టినప్పుడు ఆ ప్రదేశం అపరిశుభ్రం అవుతుంది. వాస్తు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, మురికి లేదా అపరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. దీని కారణంగా ఇంట్లో దరిద్రం, ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.

మంచంపై భోజనం చేయడం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రతికూలత రాహువు ప్రభావం. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపించి, వాస్తు దోషాలు పెరుగుతాయని చెబుతారు. ఫలితంగా ఇంట్లో అశాంతి నెలకొనడం, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావడం మరియు తీసుకునే ఆహారం శరీరానికి సరిగా జీర్ణం కాకపోవడం ఆరోగ్య  సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆహారాన్ని ఎల్లప్పుడూ ప్రశాంతంగా, డైనింగ్ టేబుల్‌పై లేదా శుభ్రమైన నేలపై కూర్చుని తినడం వల్ల మాత్రమే శుభఫలితాలు ఆరోగ్యం మరియు సంపద కలుగుతాయి.

గమనిక : పైన ఇచ్చిన అంశాలు వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం మరియు సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news