ప్రస్తుతం టీడీపీ అధినేత మరియు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనలో ఉన్నారు. ఇక్కడ మహిళలతో ప్రజా వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ … ప్రజల కోసం అణా ఈ జీవితం, వారిని ఎలా అయినా ధనవంతులుగా చేయాలన్న తపనతోనే నేనింకా రాజకీయాల్లో ఉన్నానంటూ చంద్రబాబు హార్ట్ టచింగ్ మాటలు మాట్లాడారు. డబ్బులు భూములు శాశ్వతం కాదు ప్రజలే నాకున్న ఏకైక ఆస్తి అంటూ ప్రజలు ఆకట్టుకునే విధంగా కామెంట్ చేశారు చంద్రన్న. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ద్వారా సంపాదనకు సృష్టింపచేసి ధనవంతులుగా మారుస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విధంగా కాకుండా, కరెంట్ చార్జీలు తగ్గేలా చూస్తానని హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. రైతులను ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వారికి వ్యవసాయం చేసుకోవడానికి అవసరం అయిన అన్ని వనరులను ఏర్పాటు చేస్తామని తెలిపారు చంద్రబాబు.
రాబోయే సంవత్సరంలో ఎన్నికలు జరగనుండడంతో చంద్రబాబు నాయుడు ఎలాగైనా గెలవాలని కసిగా పనిచేస్తున్నారు. మరి వైసీపీ కున్న అభిమానాన్ని తట్టుకుని టీడీపీ విజయం సాధిస్తుందా చూడాలి.