నేడు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

-

తెలంగాణ విమోచన దినోత్సవాలపై రాష్ట్రం సాధించుకున్నప్పటి నుంచి వివాదమే నడుస్తోంది. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ సర్కార్​ను డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ విమోచన దినోత్సవం రోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతోంది. ఇక గతేడాది నుంచి బీజేపీ … కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ వేడుకను జరపాలని నిర్ణయించింది. ఈ ఏడాది వేడుకల్లో పాల్గొనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఇవాళ రాత్రికి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి నగరానికి చేరుకొని సీఆర్​పీఎఫ్ సెక్టార్‌ ఆఫీసర్‌ మెస్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి దిల్లీకి వెళ్లనున్నారు. ఈ మధ్యలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల తదితర నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్‌ ముమ్మర కసరత్తు చేస్తుండటం, హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు వంటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందవి పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news