BREAKING : చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్

-

BREAKING : చంద్రబాబు నాయుడుకు మరో ఊహించని షాక్‌ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి.

Suspension of Chandrababu's former PS Pendyala Srinivas
Suspension of Chandrababu’s former PS Pendyala Srinivas

ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తన్నారు చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్. స్కిల్ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో కీలకంగా ఉన్నారు శ్రీనివాస్. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబు కు నిధులు చేరాయి అని సీఐడీ అభియోగం మోపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్.. అక్కడే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలోనే.. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు పడింది.

Read more RELATED
Recommended to you

Latest news