మరోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి..?

-

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారా అంటే.. అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 2017లో పెళ్లి చేసుకున్న కోహ్లీ, అనుష్క దంపతులు.. 2021లో వామికకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల వరకు మీడియా ఎక్కడ కూడా వామికను చూపించలేదు. కొద్ది రోజుల తరువాత వామిక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

తాజాగా మరోసారి విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే తమ రెండో సంతానానికి సంబంధించిన వార్తను ఫ్యాన్స్ తో షేర్ చేసుకోనున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారనే వార్తలు వినిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొద్ది రోజుల కిందటే ముంబైలోని ఓ గైనకాలజీ సెంటర్ కి ఇద్దరూ కలిసి వచ్చారని.. త్వరలో దీనిపై ప్రకటన చేస్తామని చెప్పి ఫొటోలు తీయవద్దని కోహ్లీ అభ్యర్థించినట్టు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news