బ్రిటన్​లో భారత హైకమిషనర్​కు నిరసన సెగ

-

బ్రిటన్​లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామికి చేదు అనుభవం ఎదురైంది. స్కాట్లాండ్​లో గురుద్వారాలోకి ప్రవేశించకుండా కొందరు ఆయణ్ను అడ్డుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖలిస్థానీ సానుభూతి నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

దొరైస్వామి.. అల్బర్ట్ డ్రైవ్​లోని గ్లాస్గో గురుద్వారా కమిటీ సభ్యులతో సమావేశం కాబోతున్నారన్న విషయం తమకు ముందుగానే తెలిసిందని ఓ ఖలిస్థానీ సానుభూతిపరుడు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దొరస్వామి గురుద్వారా వద్దకు రాగానే బ్రిటన్​లోని అతివాద సిక్కులు కొందరు ఆయన్ను అడ్డుకున్నారని తెలిపాయి. ‘గురుద్వారాకు మీకు ఆహ్వానం లేదు’ అని వారు దొరస్వామితో చెప్పారని సమాచారం. ఫలితంగా అక్కడ స్వల్ప ఘర్షణ జరిగిందని.. యూకేలో ఉన్న ఏ గురుద్వారా లోపలికీ భారతీయ అధికారులకు స్వాగతం ఉండదని చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

భారత్- యూకే కుమ్మక్కైపోయాయని ఖలిస్థానీ సానుభూతిపరుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య ఈ వ్యవహారంతో తాము విసిగిపోయామని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news