తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

-

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్ తెరిపించామన్నారు. సాగునీటి పథకాలతో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుందన్నారు. సరసమైన ధరలతో రైతులకు ఎరువులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకు బోర్డు లేదు.

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ హస్తకళలను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు ప్రధాని మోడీ. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి  బిద్రి కళాఖండాన్ని  బహుమతి అందించాను. దాని గురించి  దేశ, విదేశాల్లో చర్చ జరుగుతుంది అని తెలిపారు ప్రధాని. తెలంగాణ ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిద్ర పట్టదు అని తెలిపారు. ఐదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news