నేను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయను – బండ్ల గణేష్‌

-

నేను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయను అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు. కూకట్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ‘ఈసారి జరిగే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నాకు అవకాశం ఇస్తానని రేవంత్ చెబితే వద్దన్నా.

I will not contest Telangana elections said Bandla Ganesh
I will not contest Telangana elections said Bandla Ganesh

కాంగ్రెస్ గెలవడమే ముఖ్యం. దానికోసం పనిచేస్తా. రేవంత్ ప్రేమకు కృతజ్ఞుడిని. టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. తప్పకుండా అధికారంలోకి వస్తాం. జై కాంగ్రెస్’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా, నిన్నటి వరకు కూకట్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి ఆ సీటు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో అనూహ్యంగా గణేష్ పేరు తెరపైకి వచ్చిందట. ఈ ప్రచారం పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. నేను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయను అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news