కేసీఆర్‌ సర్కార్‌పై ఏపీ ఫిర్యాదు..నీళ్లు వాడుతున్నారంటూ !

-

కేసీఆర్‌ సర్కార్‌పై ఏపీ ఫిర్యాదు చేసింది. నీళ్లు వాడుతున్నారంటూ కేసీఆర్‌ సర్కార్‌పై ఏపీ ఫిర్యాదు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన సాగు, తాగునీటికి డిమాండ్ లేకపోయినా తెలంగాణ జెన్ కో విద్యుత్ కోసం నీరు వాడేస్తోందని AP ప్రభుత్వం కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి TS జెన్ కో శుక్రవారం సాయంత్రం 4:00 నుంచి ఈ శనివారం ఉదయం 8 గంటల వరకు 13,210 క్యూసెక్కుల నీళ్లు వాడింది.

మళ్లీ నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఇలా వాడిన నీటిని TS వాట నుంచి మినహాయించాలి’ అని AP కోరింది. ఇక నీళ్ల పంచాయితీపై జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కృష్ణా’పై కొత్తగా విధి విధానాలు చట్ట విరుద్ధం అని.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికం అని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విభజన చట్టంలో సెక్షన్-89 ద్వారా ఇప్పటికే విధి విధానాలు ఉన్నాయని… ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు మళ్లీ విధి విధానాల జారీ అన్యాయం అని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రతి నీటి బొట్టునూ రక్షించుకుంటాం.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో సీఎం జగన్ పోరాటం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news