అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 2000లకు చేరిన మృతుల సంఖ్య

-

అఫ్గానిస్థాన్​లో భారీ భూకంపం విలయం సృష్టిస్తోంది. ఆ దేశంలో పశ్చిమ ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపం ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. భూకంప విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు.. తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి ధ్రువీకరించారు. ఈ విపత్తులో వేలాది మంది తీవ్ర గాయాలపాలనైట్లు ఐక్యరాజ్య సమితి వర్గాలు వెల్లడించాయి. అప్గాన్​లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపాయి.

‘శనివారం మధ్యాహ్నం హెరాత్ నగరానికి వాయువ్య దిశగా.. 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. క్షణాల్లో 6.3, 5.9, 5.5 తీవ్రతతో పాటు పలుమార్లు చిన్న భూప్రకంపనలు రావడంతో వాటి ధాటికి పశ్చిమ అఫ్గానిస్థాన్​లో వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది ప్రజలు మరణించారు. ఆరు గ్రామాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది పౌరులు శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నాం.’ అని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే ఈ విపత్కర సమయంలో తమకు సాయం చేయడానికి సంపన్న దేశాలు ముందుకు రావాలని అఫ్గాన్ సాంస్కృతిక శాఖ మంత్రి అబ్దుల్ వాహిద్ రయాన్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news