ఇన్ఫోసిస్ రాకతో విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలు రాబోతున్నాయని పేర్కొన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. 16న విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక అటు చంద్రబబు కు కూడా కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు వెల్ నెస్ సెంటర్లో కాదు జైల్లో వున్నాడని…నేరం చేసిన వాళ్ళు ఉండేందుకే జైళ్లను పెట్టిందన్నారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టిన జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి…ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం సింపథీ కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైళ్లోనే ఉండాలని చురకలు అంటించారు ఏపీ మంత్రి అమర్నాథ్.సీఐడీ విచారణ తర్వాత లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నాడు..దొంగతనం చేసిన వాళ్ళు ఒక్కసారితో నిజం చెప్పరన్నారు.