తిరుమలలో ఇవాళ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..ఆ దర్శనాలు బంద్

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇవాళ్టి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నది టీటీడీ పాలకమండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. అయితే నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో…. పెరటాసి మాసం, దసరా సెలవుల తరుణంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా తో టీటీడీ భారీగా ఏర్పాటు చేస్తోంది.

అలాగే తిరుమల శ్రీవారి గరుడోత్సవాన్ని 19వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నిర్వహిస్తారు టిటిడి అధికారులు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పలు సేవలను మరియు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం మాడవీధులలో ఉరేగునున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.. రేపు ఉదయం బంగారు తిరుచ్చి పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. రేపు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై ఉరేగునున్నారు తిరుమల శ్రీ వారు.

Read more RELATED
Recommended to you

Latest news