ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు !

-

రెండు తెలుగు రాష్ట్రాలలో బతుకమ్మ మరియు దసరా పండుగ సందడి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ హడావిడి ఇప్పటికే ప్రారంభమైంది. ఇవాళ బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే కూడా ప్రకటించేసింది. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు హాలిడే కూడా ప్రారంభమైంది.

Today is a holiday for Telangana government employees
Today is a holiday for Telangana government employees

ఇవాళ ఎంగిలిపూలు బతుకమ్మ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు హాలిడే కూడా ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు ఇవాల్టి నుంచి దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. మళ్లీ అక్టోబర్ 24వ తేదీ వరకు ఈ దసరా సెలవులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్టోబర్ 25వ తేదీ నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news