రేవంత్ ఓ సైకో గాడు….పెద్ద బిచ్చగాడు అంటూ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. నిన్న రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పొన్నాల. పొన్నాల చావు గురించి మాట్లాడవు.. ఎవరి చావు ఎప్పుడొస్తాడో ఎవడు చెప్తాడు.. 80 ఏళ్ళ వయసున్న మనిషిని పట్టుకొని ఇలాగా మాట్లాడేది.. మనిశివా పశువువా.. అంటూ ఆగ్రహించారు. నీ తోడ పుట్టిన వాళ్లు అంత బతికే ఉన్నారా.. నీ పాపాలు నిన్ను వెంబడిస్తున్నాయి..బిడ్డ పెళ్లి ని కూడా బ్లాక్ మెయిల్ చేసి 6 కోట్లు అడుక్కున్న బిచ్చగాడివి అంటూ రెచ్చిపోయారు.
నీ మొకానికి ప్రజా సేవ అంటే తెలుసా పైసలు సేవ చేసే నువ్వు నా గురించి మాట్లాడుతావా… నువ్ కొడంగల్ గెలిచవా.. అక్కడ తంతే మల్కాజిగిరి వచ్చి పోటీ చేసావు.. అంత పోటు గడివి అయితే మహబూబ్నగర్ లో ఎందుకు పోటీ చెయ్యలేదని నిలదీశారు. మల్కాజ్ గిరి లో జనరల్ సీట్లో మాదిగ సామాజిక వర్గం చెందిన సర్వే సత్యనారాయణ గెలిచాడు.. టీడీపీ నుంచి మల్లారెడ్డి గెలిచాడు.. నువ్ ఏమైనా పోటుగాడివా.. అక్కడ గెలిచే అవకాశం ఉంటే వచ్చి వాలవు అని నిలదీశారు. కొడంగల్ ఒక కొత్త లీడర్ చేతిలో చావు దెబ్బ తిన్న నువ్వా నాకు చెప్పేదని ఫైర్ అయ్యారు.