కాంగ్రెస్ గెలుస్తుందనే ఈడీ దాడులు : అశోక్ గెహ్లాత్

-

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పలు సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంటున్నాయి. ప్రధానంగా రాజస్థాన్, తెలంగాణ, ఛతీస్ గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్, ఛతీస్ గడ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయితే ఈ తరుణంలోనే తాజాగా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని ప్రయోగిస్తుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ మండిపడ్డారు.

కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసే బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులు చేయిస్తుందని పేర్కొన్నారు. ఇన్ని రోజులు చేయించని ఈడీ దాడులు ఎన్నికలు వచ్చినప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు అశోక్ గెహ్లాత్. రాజస్థాన్ రాష్ట్ర ప్రజల హృ దయాలు గెలవలేకనే ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. కాగా రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 పేపర్ లీకేజీకి సంబంధించి కొందరూ వ్యక్తుల నివాసాల్లో ఇటీవలే ఈడీ సోదాలను నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news