వారి కోసమే పోటీ నుంచి తప్పుకుంటున్నా : డీకే అరుణ

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళలో బీజేపీ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కారణం ఏమిటో తెలియదు.. కానీ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రాష్ట్రస్థాయి పెద్ద నేత పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీలో చేరికపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తన కార్యకర్తలతో చర్చించిన తరువాతే తగిన నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. బీజేపీకి చెందిన మరొకరు ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పోటీ చేయడం లేదని ప్రకటించి సంచలనానికి తెర తీశారు.

మరెవరో కాదు.. బీజేపీకి చెందిన సీనియర్ నాయకురాలు డీకే అరుణ. ఈ సారి తన నియోజకవర్గమైన గద్వాల నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. వాస్తవానికి గద్వాల నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తను పోటీ చేయకుండా బీసీలకే టికెట్ ఇప్పించేందుకు తన అభ్యర్థిత్వాన్ని వదులు కుంటున్నట్లు ఆమె తెలిపారు. మెజార్టీ లీడర్లు బీసీల్లోని వాల్మీకి బోయలకు టికెట్ ఇవ్వాలని డీకే అరుణ సమక్షంలో తీర్మానం చేశారు. అనంతరం ఆ తీర్మాన పత్రాన్ని హైకమాండ్ కు పంపించినట్టు తెలిపారు. బీజేపీలో డీ.కే. అరుణతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డా.కె.లక్ష్మణ్ కూడా పోటీ చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. రెండో విడుతలో వీరి పేర్లుంటాయో లేదో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news