ఏపీలో విద్యుత్తు ఛార్జీల పెంపు వాస్తవమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వినియోగం పెరగడంతో అవసరమైన విద్యుత్తును ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నామని, ఆ మొత్తం వినియోగదారులు భరించడం అనివార్యమన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఓటేయని ఇతర పార్టీల వారిని ప్రభుత్వాలు హింసించేవని, ప్రస్తుతం అలాంటి విధానం లేదన్నారు. వైయస్ జగన్ హయాంలో పనిచేస్తున్న ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు సమున్నత ప్రాధాన్యమిస్తుందన్నారు. సర్వశిక్ష అభయాన నిధులతో రూపుదిద్దుకున్న ఈ భవనం ఇక్కడి విద్యార్థులకు వసతి సమస్యలను తీరుస్తుందని, అలానే మరిన్ని ఆధునిక సౌకర్యాలను కూడా పాఠశాలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.