శ్రీదేవి తొలి హీరో చంద్రమోహన్ కెరీర్ లో దక్కించుకున్న అవార్డులివే !

-

టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు సీనియర్ హీరో చంద్రమోహన్ (80) కాసేపటి క్రితమే గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో మరణించడం జరిగింది. చంద్రమోహన్ 1966 లో రంగులరాట్నం సినిమాతో అరంగేట్రం చేయగా ఆ తర్వాత ఎన్నో సినెమాలో హీరోగా, కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఎన్నో అవార్డులను తన పేరిట అందుకున్నాడు. ఇక అతిలోకసుందరి శ్రీదేవి లాంటి హీరోయిన్ తో నటించిన మొదటి హీరోగా గుర్తింపును దక్కించుకున్నాడు. చంద్రమోహన్ శ్రీదేవి “పదహారేళ్ళ వయసు” సినిమాలో నటించారు. ఈ సినిమా శ్రీదేవికి మొదటిది కావడం విశేషం, ఆ తర్వాత కూడా శ్రీదేవి చంద్రమోహన్ కాంబినేషన్ లో నటించారు. ఈయన తన కెరీర్ లో మొత్తం 932 సినిమాలలో నటించారు.

చంద్రమోహన్ చేసిన సిరిసిరి మువ్వ మరియు పదహారేళ్ళ వయసు సినిమాలలో నటనకు మెచ్చి 2 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఇంకా పలు సినిమాలకు గాను 6 నంది అవార్డులు సొంతం చేసుకున్నాడు చంద్రమోహన్.

Read more RELATED
Recommended to you

Latest news