అయోధ్య రామయ్య గర్భాలయం, పీఠం చిత్రాల విడుదల

-

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరి 22వ తేదీ ఈ ప్రారంభోత్సవం జరగనున్న వేళ తాజాగా ఈ మందిరంలోని గర్భగుడిలో మూలవిరాట్టును ప్రతిష్ఠించే పీఠం ఫొటోను రామమందిర ట్రస్టు కార్యదర్శి చంపత్‌రాయ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ.. గర్భగుడి నిర్మాణం దాదాపు పూర్తయిందైని.. శ్రీరాముడిని ఈ స్థానంలో ప్రతిష్ఠించబోతున్నామని ఫొటో షేర్ చేసి క్యాప్షన్ రాసుకొచ్చారు.

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే 2024 జనవరి 22న దేశవ్యాప్తంగా సెలవుదినంగా ప్రకటిస్తే ఆ కార్యక్రమాన్ని అందరూ వీక్షించే అవకాశం ఉంటుందని సాధువు మహంత్‌ అంకిత్‌శాస్త్రి మహారాజ్‌ అభిప్రాయపడ్డారు. వారం రోజులపాటు జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్న విషయం తెలిసిందే. మరోవైపు 130 దేశాల ప్రతినిధులతోపాటు వేల సంఖ్యలో సాధువులు ఈ కార్యక్రమానికి వస్తారు. ఉత్సవానికి వచ్చే భక్తుల కోసం ఓ ప్రైవేటు సంస్థతో కలిసి జర్మన్‌ టెక్నాలజీతో వాటర్‌ప్రూఫ్‌ గుడారాలను ఏర్పాటు చేసినట్లు అయోధ్య అభివృద్ధి సంస్థ వెల్లడించింది. వీటిని ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news