ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇకపై రూ.25లక్షల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవడం ద్వారా జగన్ మోహన్‌రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారని ఆంధ్ర ప్రదేశ్రా ష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు పట్టణం 49వ డివిజన్లోని భారత్‌పేట లో మంత్రి రజిని తాజాగా ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలను వైద్య ఆరోగ్యశాఖలో తీసుకొచ్చారని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు గారు, డిప్యూటీ మేయర్ షేక్ సజీల గారు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ గారు, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి గారు, కమిషనర్ కీర్తి చేకూరి గారు తదితరులు హాజరయ్యారు.