పదో తరగతి సైన్స్‌ పరీక్ష రెండు రోజులు.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన

-

తెలంగాణ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్‌ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించింది. సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం అనే రెండు పేపర్లు ఉండటం వల్ల పరీక్ష రెండు రోజులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన సమర్పించారు.

పదో తరగతిలో ఆరు సబ్జెక్టులు ఉండగా అందులో అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్‌(ప్రశ్నపత్రం) ఉంటుందన్న విషయం తెలిసిందే. సైన్స్‌లో రెండు పేపర్లు ఉన్నా ఒకే రోజు 15 నిమిషాల వ్యవధి ఇచ్చి ఒకదాని తర్వాత మరొకటి నిర్వహిస్తున్నారు. అయితే దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. మరోవైపు వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు గతంలో సర్కారుకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈ విధానంపై పునరాలోచన చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం గమనార్హం. త్వరలో దీనికి ఆమోదం లభించవచ్చని వారు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news