ప్రభాస్- మారుతి సినిమా నుంచి క్రేజీ అప్డేట్

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రభంజనం సృష్టించాడు. బాహుబలి తర్వాత సరైన హిట్ లేక సతమతమైతున్న ప్రభాస్ సలార్తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఐదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ రఫ్ లుక్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ లుక్లో ప్రభాస్ను చూసి ఫ్యాన్ ఫుల్ ఖుష్ అయిపోయారు. అయితే ఇప్పటి వరకు డైనోసార్ ప్రభాస్ చూసిన ఆడియెన్స్ ఫర్ ఏ ఛేంజ్ డార్లింగ్ ప్రభాస్ను చూసేందుకు రెడీ అవ్వాలని డైరెక్టర్ మారుతి అంటున్నారు.

హీరో ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ను ఇచ్చింది చిత్ర బృందం. సంక్రాంతి పండుగ రోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ‘ఇప్పటి వరకు డైనోసార్ ప్రభాస్ను చూశారు, ఇక డార్లింగ్ ప్రభాస్ను చూసేందుకు సిద్ధం అవ్వండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రభాస్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news