పాన్ షాప్ నడిపే వ్యక్తి చేతిలోకి ప్రజాపాలన దరఖాస్తులు వెళ్లాయని ఫైర్ అయ్యారు బీఆర్‌ఎస్ పార్టీ నేత దాసోజ్ శ్రవణ్. ప్రజాపాలన దరఖాస్తులు చిత్తు కాగితాలవలె రోడ్ల మీదికి వచ్చాయంటే, ప్రభుత్వ అసమర్ధతకు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రజలు గంటలకొద్దీ లైన్లలో నిలబడి ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తులు పెట్టుకుంటే పాన్ షాప్ నడిపే వ్యక్తి చేతిలోకి ఆ దరఖాస్తులు ఎట్లా వచ్చాయి ? అని నిలదీశారు.
వాటిని కంప్యూటర్లలో ఎంట్రీ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాదని, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం ఏంటి??? అంటూ ఫైర్ అయ్యారు. పాత పథకాలను కొనసాగించేందుకు కొత్త దరఖాస్తులు తీసుకోవడమే తప్పు. తీసుకున్నవాటిని ఇంత నిర్లక్ష్యంగా రోడ్లపాలు చేయడం ఘోరమైన ప్రభుత్వ నేరం.. దరఖాస్తులు రోడ్లపాలు అయినంక ఫీల్డ్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారు?? అంటూ మండిపడ్డారు. వెంటనే విచారణ జరిపి, ఈ తప్పిదాలను సరిదిద్దండని డిమాండ్ చేశారు బీఆర్‌ఎస్ పార్టీ నేత దాసోజ్ శ్రవణ్.