అఖిల్ ‘ఏజెంట్’ OTT స్ట్రీమింగ్ అప్పుడే?

-

అక్కినేని అఖిల్ దాదాపు ఒక మంచి హిట్టు కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడకపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.. అయితే కథల ఎంపిక విషయంలో తడబాటు వల్లే అఖిల్ ఇలా తన కెరీర్లో ఒక సక్సెస్ ను కూడా చూడలేదంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Akhil Akkineni, Mammootty Movie Agent OTT Release Date Confirmed

ఇది ఇలా ఉండగా, అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ఏజెంట్’. యాక్షన్ త్రిల్లర్ గా భారీ బడ్జెట్లో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. దీంతో తన ఖాతాలో మరో డిజాస్టర్ మూటగట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘SONY LIV’ లో ఏజెంట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news