కేసీఆర్ ను బొంద పెడతామన్న వారెందరో బొందలో కలిసి పోయారు – నిరంజన్ రెడ్డి

-

కేసీఆర్ ను బొంద పెడతామన్న వారెందరో బొందలో కలిసి పోయారని..అధికారిక పర్యటనలో సీఎం రేవంత్ రాజకీయాలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు BRS మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. krmb లో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్ లో స్పష్టం గా పేర్కొన్నారని… ఇపుడు చేరలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

మంత్రుల నోటి మాట ప్రామాణికమా ?మినిట్స్ ప్రామాణికమా ? కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేంద్ర బలగాల పహారా లోకి వెళతాయి….నీటి వాటా తేల్చేదాకా krmb పై యథాతథ స్థితి కొనసాగాలని కోరారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సవరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం ,మహబూబ్ నగర్ , నల్గొండ ప్రజలు కాంగ్రెస్ ను భారీ గా సీట్ల తో గెలిపించినందుకు మీరిచ్చిన బహుమానమా ఇది ? ఆంధ్రా ప్రయోజనాలు నెరవేర్చెందుకే కేంద్రం కంకణం కట్టుకుందని ఫైర్‌ అయ్యారు. krmb పేరుతో కృష్ణా నీళ్ల పై ఏపీ పెత్తనం సాగిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news