నల్గొండ జిల్లా లో ప్రజావాణి కార్యక్రమం లో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం అని అన్నారు. ప్రజల కష్టాలని బాధల్ని విని అభాగ్యులైన వాళ్ల సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. గత ప్రభుత్వం వీటిని నిషేధించడం జరిగిందని చెప్పారు.
కానీ నేడు ప్రగతి భవన్ అలానే సెక్రెటరీ సెక్రటేరియట్ ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు ఆయన. నేడు సామాన్య మానవుడు కూడా వారి బాధని తెలుపుకున్నందుకు మంత్రులు వద్దకు ఎమ్మెల్యేల కి ప్రతి సోమవారం కంప్లైంట్ లు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు త్వరలోనే బిఆర్ఎస్ ప్రభుత్వం బండారం బయట పెడతామని అన్నారు.