ఇండియా కూటమికి షాక్.. లోక్సభ బరిలో ఒంటరిగానే ‘దీదీ’

-

మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న వేళ ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోదీ సర్కార్ను కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో జరిగిన చర్చలు విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్ ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

“లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బంగాల్‌లో ఉన్న 42 స్థానాల్లోనూ మేము ఒంటరిగా పోటీ చేస్తాం. దేశంలోని ఇతర స్థానాల్లో సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నప్పటికీ బంగాల్‌లో మాత్రం మేము ఒంటరిగానే భారతీయ జనతాపార్టీని ఓడించగలం. కాంగ్రెస్‌ పార్టీతో ఎలాంటి చర్చలు జరగలేదు. తే మేము ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నాం. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్‌ ఇండియా కూటమిని పరిగణిస్తాం.” అని మమతా బెనర్జీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news