కుటుంబ పెన్షన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పెన్షన్దారులు తమ మరణానంతరం వచ్చే పెన్షన్.. భర్తకు కాకుండా కూతురు/కుమారుడికి చెందేట్లు వారిని నామినేట్ చేయొచ్చు. ఇంతవరకు తన మరణాంతరం కేవలం భర్తను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. అతడు కూడా మరణిస్తే పిల్లలకు పెన్షన్ ఇచ్చేవారు. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్ చెల్లించడానికి అవకాశం కలిగింది.మహిళా ప్రభుత్వోద్యోగి లేదా పింఛనుదారుడు తప్పనిసరిగా సంబంధిత కార్యాలయ అధిపతికి వ్రాతపూర్వక అభ్యర్థన చేయాలని ఆయన అన్నారు.
విడాకుల ప్రక్రియకు దారితీసే పరిస్థితులను లేదా గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, వరకట్న నిషేధ చట్టం లేదా భారతీయ శిక్షాస్మృతి వంటి చట్టాల కింద నమోదైన కేసులను ఈ సవరణ పరిష్కరిస్తుంది అని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. గతంలో మరణించిన ప్రభుత్వోద్యోగి పెన్షన్ జీవిత భాగస్వామికి మంజూరయ్యేది .ఇతర కుటుంబ సభ్యులు అనర్హుల్గా ఉండేవారు.