పుష్ప సినిమా వాయిదా వేస్తే మా సినిమా విడుదల చేసుకుంటాం…!

-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిపోదా శనివారం’ మూవీని ఆగస్టు 15న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ రిలీజ్ వాయిదా పడితేనే ఆ తేదీన ఈ మూవీ రానుంది. దీంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ మూవీ రిలీజ్ వాయిదా పడితే ఏప్రిల్ 5 వచ్చేందుకు విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ సిద్ధమవుతుంది.

 

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్  ఆసక్తిని రేకెత్తిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీ రైట్స్ను రూ.45 కోట్లకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ చిత్రం పై  భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news