తూర్పుగోదావరి జిల్లా వాసులకు బిగ్ అలర్ట్. నేటి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేయబడనుంది. నేటి నుంచి మరమ్మత్తు పనులు నిమిత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా పది రోజులు పాటు మూసివేయనున్నారు.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో మరమ్మత్తు పనులు జరుగనున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పై నుంచి ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచనలు చేశారు అధికారులు. ఫిబ్రవరి 10 వరకు మరమ్మత్తుల అనంతరం యధావిధిగా రాకపోకలకు అనుమతి ఇచ్చారు. పనులు నాణ్యత కలిగి త్వరి తగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.