ఏపీలో జోరుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 30.61 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం సచివాలయాల పరిధిలో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 10వేలకుపైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాటు చేశామన్నారు. కన్వెయన్స్ డీడ్స్ ను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి మూడో వారంలో సీఎం జగన్ ప్రారంభించే అవకాశం ఉంది.

Loud house registration program in AP

అటు ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.రేషన్ కార్డుదారులకు నేటి నుంచి సరుకులు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఫిబ్రవరి 17 వరకు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు. బియ్యంతో పాటు పంచదార, గోధుమపిండి ఇస్తామని….ఫిర్యాదులు ఉంటే 1967కు కాల్ చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news