యాక్టర్ నిఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నిఖిల్ పలు సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నిఖిల్ తాజాగా కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. కార్తికేయ 2, 18 పేజెస్ వంటి సినిమాలతో హిట్ కొట్టేశారు నిఖిల్. ప్రస్తుతం స్వయంభు, ఇండియా హౌస్, చైనా పీస్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు తాజాగా నిఖిల్ తనకి పుట్టబోయే బిడ్డ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
మా మొదటి బేబీ త్వరలోనే మా ముందుకు రాబోతోంది ఈ విషయంలో నా భార్య పల్లవి నేను చాలా హ్యాపీగా ఉన్నామని షేర్ చేసుకున్నారు. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలని తన భార్య సీమంతం ఫోటోని కూడా షేర్ చేశారు నిఖిల్. అలానే క్యాప్షన్ కూడా రాసుకోచ్చారు. దీంతో ఫాన్స్ మీ బేబీ రాకతో మీ జీవితంలో మరింత నవ్వులు పూయాలని కెరియర్ పరంగా సక్సెస్ ని అందుకోవాలని కోరుకుంటున్నాము అని నిఖిల్ అన్నారు.