టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసారా’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వెలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్ అవతరిస్తారు’ అంటూ పవర్‌ఫుల్ పోస్టర్‌ను మూవీ టీమ్ షేర్ చేసింది.
‘మెగాస్టార్ స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అని ఈ సినిమాపై దర్శకుడు అంచనాలు పెంచేశారు. ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో మరింత ఫిట్‌గా కనిపించడం కోసం చిరంజీవి జిమ్‌లో కసరత్తులతో చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇటీవల షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.