రేషన్‌కార్డు ఉన్న వారికే ఉచిత విద్యుత్ : CM రేవంత్

-

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం రేవంత్ కీలక వాక్యాలు చేశారు. తెల్లరేషన్ కార్డు కలిగిన వినియోగదారులు గత ఏడాది వినియోగించిన విద్యుత్తు లెక్కలను పరిగణలోకి తీసుకొని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని నిన్న ఇంద్రవెల్లి సభలో ప్రకటించారు.

రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్ తో పాటు రూ. 500కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై మార్గదర్శకాలు రూపొందించి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.  ‘6నెలల్లో ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. నీ అయ్య ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు. ఎవడు కొట్టేది? మీ ఊర్ల ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి’ అని రేవంత్ పిలుపునిచ్చారు. కేసీఆర్కు గద్దర్ ఉసురు తాకిందని రేవంత్ అన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news