రిషబ్ పంత్ రీ ఎంట్రీ పై పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఢిల్లీ క్యాపిటల్ కోచ్ రికీ పాంటింగ్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కి పంత్ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీ ఎంట్రీ పై ఇప్పుడే ఏమి చెప్పలేనని బాంబు పేల్చాడు. రీ ఎంట్రీ పై పంత్ ను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్ లకు సై అంటాడని.. వికెట్ కీపింగ్ విషయంలో తగ్గేదే లేదని అంటాడని.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి దిగుతానని ధీమాగా చెబుతాడని పేర్కొన్నాడు.

పంత్ ప్రస్తుత పరిస్తితి చూస్తే.. వచ్చే సీజన్ లో అతను ఆడగలడని తెలుస్తోంది. కానీ అతడు పూర్తి మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడా..? కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టగలడా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపాడు. పంత్ రీ ఎంట్రీ కి సంబంధించి ఎలాంటి విషయమైనా తమకు యాడెడ్ అడ్వాటేజ్ అవుతుందన్నాడు. కారు ప్రమాదం తరువాత  గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ రీ ఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news