బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

-

మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్​కు ఆమోద ముద్ర వేసేందుకు రాష్ట్ర కేబినెట్​ భేటీ అయింది. అసెంబ్లీలో ‘ఓటాన్ అకౌంట్​’ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్​ను పెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.

ప్రస్తుత ఏడాది(2023-24)కి సంబంధించి 2023 ఫిబ్రవరిలో రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయాలు రాకపోవడంతో అధికారులు ఆ పద్దును సవరించారు. సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది(2024-25)కి బడ్జెట్‌ అంచనా రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకూ ఉండే అవకాశాలున్నట్లు సమాచారం. నిధుల కేటాయింపులో ఆరు గ్యారంటీలకు తొలి ప్రాధాన్యమివ్వనున్నారు. వీటి అమలుకు వచ్చే ఏడాది దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా అవసరమని అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news