Kalki Movie : స్టార్ హీరోయిన్ దీపికాకు రూ.20 కోట్లు?

-

టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898’ AD. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే చాలా అప్డేట్స్‌ వచ్చాయి. అయితే.. కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నటించేందుకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె కెరీర్ లోనే అత్యధికంగా రూ. 20 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

20 crores for star heroine Deepika

గత చిత్రాలకు ఆమె రూ. 15 కోట్ల వరకు తీసుకున్నట్లు సినివర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి డేట్స్ ఎక్కువగా ఇవ్వడంతో భారీ రెమ్యునరేషన్ కోరినట్లు తెలిపాయి. ఇక టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898’ AD గురించి మరో అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్​ నారాయణన్ ప్రభాస్ ఫ్యాన్స్​కు కల్కితో గ్రాండ్​ ట్రీట్ ఇవ్వనున్నారట. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్​లో బ్యాక్ గ్రౌండ్​ స్కోర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news