మన శరీరంలోని మలినాలు, విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వస్తాయి.. మనం తాగే నీరును బట్టే మూత్రం వస్తుంది.. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి.. ఆ మలినాలను వాటర్‌లో పెట్టి పంపిస్తాయి.. అప్పుడు బ్రెయిన్‌కు ఒక సిగ్నల్ అందుతుంది.. దాంతో మనకు సుస్సూకు వెళ్లాలనిపిస్తుంది.. ఇది ప్రాసెస్.. కానీ మీరు ఆ టైమ్‌లో బయట ఉండటమో, ఏదైనా పనిలో బాగా బిజీగా ఉండటమో చేస్తున్నట్లేతే టాయిలెట్‌ను హోల్డ్ చేస్తారు.. ఇంటికి వచ్చాక వెళ్లొచ్చులే అనుకుంటారు.. ఇలా అస్సలు చేయకూడదు.. అయితే.. మూత్రవిసర్జన ఏ సమయంలో చేస్తే మంచిదో తెలుసా..? దీనికి సమయం ఏంట్రా బాబు ఎప్పుడు వస్తే అప్పుడు పోతాం అనుకుంటున్నారా..?

మూత్ర విసర్జన ఉదయం పూట పరగడుపున ఎక్కువగా చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.. ఈ సమయంలో మూత్రవిసర్జన చేయడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలు ఎక్కువగా బయటకు పోతాయి. మన శరీరంలో ఆహారం జీర్ణమైన దగ్గరి నుంచి కాలేయం వ్యర్థాలను బయటకు పంపించే పనిలో ఉంటుంది.
శరీరంలో ఉండే వ్యర్థాలు, పురుగు మందులు, ఇతర అనారోగ్య సమస్యలకు వాడిన మందుల్లో ఉండే అవశేషాలను, శరీరంలో విడుదలైన టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్‌ను మన కాలేయం ఫేస్ 1, ఫేస్ 2లో నిర్వీర్యం చేసి ఫేస్ 3 లో మూత్రం ద్వారా బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియ అంతా రాత్రి పూట మన శరీరంలో జరుగుతుంది. అందుకే మనం ఉదయం పూట విసర్జించే మూత్రం ఘూటుగా వాసనను కలిగి ఉంటుంది. ఉదయం పూట ఒక్కసారి మూత్ర విసర్జన చేయగానే ఈ వ్యర్థ పదార్థాల్నీ బయటక పోవు. కొన్ని విష పదార్థాలు అలాగే రక్తంలో ఉంటాయి. కాబట్టి ఎక్కువ సార్లు ఉదయం పూట మూత్ర విసర్జన చేయాలి. ఉదయం పూట లీటర్ నుంచి లీటర్నర వరకు మూత్ర విసర్జన చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు మొత్తుకుంటున్నారు.. ఉదయం లేవగానే లీటర్ నుంచి లీటర్నర అయినా వాటర్ తాగమని..
ఇలా తాగడం వల్ల ముప్పావు లీటర్ నుంచి లీటర్ వరకు మూత్రం రూపంలో బయటకు వస్తుంది. ఇలా నీటిని తాగిన రెండు గంటల తరువాత మరలా నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల రక్తంలో మిగిలిన వ్యర్థాలన్నీ మూత్రపిండాలకు చేరుతాయి. మూత్రిపిండాల నుంచి ఆ వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. ఇలా ఉదయం పూట రెండు లీటర్ల మోతాదులో మూత్రవిసర్జన చయడం వల్ల కాలేయం విడగొట్టిన వ్యర్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వస్తాయి. ఉదయం పూట ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల నీటిని తాగి మూత్ర విసర్జన చేయడం వల్ల మన శరీరంలోని మలినాలన్నీ తొలగిపోయి అంతర్గతంగా శరీరం శుభ్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే లేవగానే బాడీలోపల స్నానం చేసినట్లు.. అయితే అన్ని నీళ్లు ఒకేసారి తాగలేం, పొట్టలో పట్టవు అనుకునేవాళ్లు..గ్యాప్ ఇచ్చి తాగండి.. లేచిన రెండు గంటల్లోపు తాగడానికి ప్రయత్నించండి.. మీరు బయట ఎన్ని సోకులు పడ్డా..లోపల శరీరం క్లీన్‌గా లేకపోతే స్కిన్ బాగుండదు. మొటిమలు, మచ్చలు కూడా ఉంటాయి.. ముఖ్యంగా ముఖంపై మొటిమలు ఉన్నవాళ్లు ఇలా ఒక్క నెలరోజులు చేసి చూడండి.. అదిరిపోయే రిజల్ట్ ఉంటుంది.
