ఏపీ వాలంటీర్లకు రఘురామ వార్నింగ్‌..మీ సంగతి చూస్తానంటూ…!

-

వైకాపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వాలంటీర్ల పరిస్థితి అధోగతేనని రఘురామకృష్ణ రాజు హెచ్చరించారు. వాలంటీర్లు మారాలని, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని అధిష్టించే పార్టీ నేతలు కూడా అభయం ఇస్తున్నారని, వెధవ పనులు చేసే వారిని రానున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా తీసివేస్తారని అన్నారు. నిజాయితీగా ఉండండి… ఎవరికి ఓటు వేయించాలి అనే దానితో మీకు ఏమిటి సంబంధం… మీ సేవలు మీరు చేసుకోండి… ఎవరికి ఓటు వేయాలో ఓటర్లు నిర్ణయించుకుంటారు…

ఎవరైతే వాలంటీర్లు ఫలానా వారికి ఓటు వేయమని చెప్పకుండా ఉంటారో వారి పేర్లను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని రానున్న ప్రభుత్వంలో కొనసాగించడం జరుగుతుందని అన్నారు. వైకాపాకు ఓటు వేయండి, టీడీపీకి ఓటు వేయ వద్దు అంటే ఇక మీ ఉద్యోగాలు ఉండవని, అలాగని టీడీపీ, జనసేనకు కూడా ఓటు వేయమని ప్రచారం చేయాలని ఎవరూ చెప్పడం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారని, తాము జగన్ సైన్యమని భావించి ఎటువంటి పిచ్చి పనులు చేయవద్దని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. ప్రభుత్వ ఖర్చు 350 కోట్ల రూపాయలతో వాలంటీర్లకు వందనం పేరిట సేవా రత్న, సేవ వజ్రా వంటి అవార్డులను అందజేశారని, ఆ పని, ఈ పని అంటూ 800 కోట్ల రూపాయలను దోచారని, అందులో నుండి ఖర్చు చేసుకోవచ్చు కదా?, ప్రభుత్వ సొమ్ము ఇచ్చి వాలంటీర్లను పార్టీ తరఫున ప్రచారం చేయాలని చెప్పడం దారుణం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news