ఆ పని చేసి అలసిపోవాలని ఉంది.. శృతి హాసన్ హాట్‌ కామెంట్స్‌

-

ఆ పని చేసి అలసిపోవాలని ఉందంటూ టాలీవుడ్‌ హీరోయిన్‌ శృతి హాసన్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు పరిశ్రమలో శ్రుతి హాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురు గా అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు. మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య బాబు వీర సింహ రెడ్డి లో నటించి మెప్పించింది.

Shruti Hassan Hot Comments viral

ఆమె టాలెంట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు అర్ధం అవుతుంది. అయితే…లీడ్ రోల్ లో చేసినా…. వేరే వాళ్ళ చిత్రాల్లో నటించినా…. పాత్రకు న్యాయం చేసేందుకు 100% శ్రమిస్తానని శృతి హాసన్ తెలిపారు. ‘అలా కష్టపడి పని చేయడమే నాకు ఇష్టం. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడం కంటే మంచి అనుభూతి మరొకటి లేదు. రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి కలగలేదంటే అదే నాకు చెత్త అనుభవంగా అనిపిస్తుంది’ అని అన్నారు. శృతి ప్రస్తుతం అడివి శేషుతో డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news