మేడారం జాతరకు వెళ్లని వారికి TSRTC గుడ్ న్యూస్..ఇక ఇంటికే !

-

మేడారం జాతరకు వెళ్లని వారికి TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఇంటికే పంపించేలా రూట్‌ మ్యాప్‌ సెట్‌ చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారిక ప్రకటన చేశారు. మేడారం మహా జాతరకు వెళ్లలేకపోతున్నారా..!? అయితే మీకో శుభవార్త.

rtc good news to who not going to medaram

శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో బుక్‌ చేసుకుంటే మీ ఇంటికి పంపించే సదావకాశాన్ని కల్పిస్తోంది TSRTC అంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మరింకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మేడారం ప్రసాదానికి ఆర్డర్ ఇవ్వండి. తల్లుల అనుగ్రహాన్ని పొందండంటూ పేర్కొన్నారు.

కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు కోళ్లు, మేకలను తీసుకొస్తే ఆర్టీసీ బస్సుల్లోకి అనుమతించమని టీఎస్ఆర్టీసీ ఎండీ సీవీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news