ఢిల్లీ-హరియాణా సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అన్నదాతలు చేపట్టిన ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఓ రైతు మరణించాడు, మరో వ్యక్తి గాయపడ్డాడు అని వచ్చిన వార్తలపై హర్యానా పోలీసులు తాజాగా స్పందించారు.అయితే అన్నదాత మృతిని హరియాణా పోలీసులు ఖండించారు.ఎవరూ చనిపోలేదని పోలీసులు స్పష్టం చేశారు. డేటా సింగ్-ఖనోరీ సరిహద్దు లో ఇద్దరు పోలీసులు, ఒక నిరసనకారుడు గాయపడినట్లు సమాచారం ఉంది’ అని హర్యానా పోలీసులు తెలిపారు.
కనీస మద్దతు ధర కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే.పంటలకు కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరిస్తూ రైతులు మరోసారి ఆందోళనబాట చేపట్టారు.