స్కూల్ బస్సులు, భారీ వాహనాల్లో కూడా సీటు బెల్ట్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అంతర్జాతీయ రహదారి సమాఖ్య ఓ లేఖలో కోరింది. ఇది రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి కారణమవుతుందని పేర్కొంది. బస్సు ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సీట్ బెల్ట్ ఉంటే ప్రమాదం నుంచి బయటపడతారని పేర్కొంది. సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కోరింది.
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ 2021 నివేదిక ప్రకారం.. అమెరికాలో బస్సు ప్రమాదాల కారణంగా కేవలం 14 మంది,చైనా (2022)లో బస్సు ప్రమాదాల్లో 215 మరణించారు. ప్రజా రవాణా విషయంలో ఆ దేశాలు అవలంబిస్తున్న విధానాలే దీనికి కారణమని తెలిపారు.ఇండియాలో బస్సుల్లో ఈతరహా జాగ్రత్తలు సరిగ్గా పాటించకపోవడంతో బడికి వెళ్లే పిల్లలు, అమాయకుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.